సినిమా ఇండస్ట్రీలో చిరు భుజం కాయాల్సిన టైమ్ వచ్చిందట. దాసరి నారాయణరావు తర్వాత చిరంజీవి పెద్దరికం తీసుకుని.. ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతోన్న సినిమాల విషయంలో కలగజేసుకోవాలట. చిరంజీవి పెద్దరికం చూపించాల్సిన సమయం ఆసన్నమైందట. ఈ గ్రేట్ వర్డ్స్ వింటుంటే అర్థం కావటంలా.. చిరంజీవి మీద గట్టిగా ప్లాన్ చేశారనే విషయం. నరం లేని నాలుక ఎన్ని రకాలుగా అయినా మాటలు మారుస్తుంది అంటారు కదా.. అలా అప్పుడెప్పుడో చిరంజీవి ఇండస్ట్రీకి కోసం పెద్దన్నగా నిలబడతానన్న మాటని తీసుకుని.. అలా వార్తని అల్లేశారు. ఇప్పుడా గ్రేట్ వర్డ్స్ విని.. వెంటనే చిరంజీవి రంగంలోకి దిగి సమస్యని పరిష్కరించాలన్నమాట. తద్వారా చిరంజీవి పెద్దరికం నిలబడుతుందన్నమాట. ఏం ప్లాన్ చేశార్రా?
అంటే మీరు చెబితేగానీ మెగాస్టార్‌కి తెలియదన్నమాట. మీరు రాస్తేగానీ ఆయన రంగంలోకి దిగడన్నమాట.. అంతేనా? మీతో చెప్పించుకునే స్టేజ్‌లో ఆయన ఉన్నాడనే భ్రమలో బతికేయండి. అయినా చిరంజీవి క్లియర్‌గా చెప్పాడు కదరా.. తగాదాలు తీర్చే పెద్దరికం నాకు వద్దని.. మరిచిపోయార్రా! ఆయన ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే పెద్దన్నలా నిలబడతానంది.. తన ఇంటి తలుపు తెరిచి ఉంచుతానంది.. ఇలాంటి పంచాయితీలు తీర్చడానికి కాదురా. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మాత్రమే. అలాంటి వారికి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. తెలుగులోనే చెప్పాడు కదరా..
ఇప్పుడేంటి.. చిరంజీవి రంగంలోకి దిగి రఫ్పాడించాలి. దాని ద్వారా మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు మార్చి మార్చి రాసేసుకోవచ్చు. అదిగో.. మహేష్, నాగ్, వెంకీలను కాదని హను-మాన్‌కి చిరు సపోర్ట్ చేశాడని.. ఇప్పుడు ఎవడైతే భుజం కాయాలని సలహా ఇచ్చాడో.. వాడే రేపు రాతలు రాసేస్తాడు. అంతటితో ఆగుతారా? చిరంజీవి మీ హీరోలకు సపోర్ట్ చేయలేదు కాబట్టి.. ఆ హీరోల ఫ్యాన్స్ రేపు జనసేనకి సపోర్ట్ చేయవద్దంటూ.. ఎక్కడి నుండి ఎక్కడికో లింకులు పెడతారు. వారి లింకులు వారికి కూడా అర్థం కావు. ఏదో రకంగా మెగా నామస్మరణ చేయనిదే.. వారి కలానికున్న పాళీ కూడా పనిచేయదు మరి.
మీకు తెలుసో లేదో.. మీరు సలహా ఇవ్వాలని చూస్తున్న హను-మాన్ సినిమాకి ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆదివారం జరిగే హను-మాన్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా? ఆ సినిమాకి చిరు ఎంత వరకు సపోర్ట్ ఇవ్వగలరో అది ఇస్తూనే ఉన్నారు. అది మీరనుకుంటున్నట్లుగా, మీరు ప్లాన్ చేసినట్లుగా కాదురోయ్. ఆయనకు తెలుసు.. ఎవరికి, ఎక్కడ, ఎలా సపోర్ట్ ఇవ్వాలో. మీ నుంచి చెప్పించుకునే స్టేజ్‌లో మెగాస్టార్ లేడనే విషయం ఫస్ట్ తెలుసుకోండి.. ఓకేనా?