కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇప్పుడు తెలుగు స్టార్స్ కి, ప్రేక్షకులకి బాగా దగ్గరగా కనిపించడమే కాదు.. ఆయన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తూ ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా సౌత్ స్టార్స్ సినిమాల్లో క్యామియో రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో శివన్నగా కనిపించి అందరికి మెప్పించిన శివ రాజ్ కుమార్ ఇప్పుడు రాబోతున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ లోను కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
తాజాగా మరో సౌత్ స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాలో నటించబోతున్నట్లుగా శివరాజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా ఫిలిం గేమ్ చెంజర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో ముగుస్తుంది అనే టాక్ ఉంది. మార్చి నుంచి రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో RC16 మొదలు పెడతారనే టాక్ ఉంది. ఆ చిత్రంలోనే శివ రాజ్ కుమార్ నటిస్తున్నట్లుగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కన్ ఫర్మ్ చెయ్యడం మెగా ఫాన్స్ లో ఉత్సాహానిచ్చింది. రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ లో తాను భాగమవుతున్నాని తెలిపారు.
శివ రాజ్ కుమార్ RC 16 లో విలన్ గా కనిపిస్తారమేమో లేదంటే చరణ్ కి అన్నగా కనిపిస్తారేమో అనే ఊహాగానాల్లోకి మెగా అభిమానులు వెళుతున్నారు.