కొన్నాళ్లుగా టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలు రిలీజ్ కాగానే ఆ సినిమాలు కొరియన్ సినిమాలకి కాపీ, ఆ సినిమాలు ఓ నవలని పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం చూస్తున్నాము. గతంలో అ.ఆ.. సినిమా అప్పుడు మీనా నవలని కాపీ కొట్టారంటూ త్రివిక్రమ్ పై చాలా విమర్శలొచ్చాయి. అదంతా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ నుంచి రాబోతున్న గుంటూరు కారం విషయంలోనూ ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో కనిపించడమే.
మహేష్ బాబు-శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబోలో త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం జనవరి 12 న సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతూ ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంది. ఇప్పుడు ఈసినిమా ఓ నవలకి కాపీ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గుంటూరు కారం రిలీజ్ అవ్వకుండానే గుంటూరు కారం కి యద్దనపూడి సులోచన రాణి కీర్తి కిరీటాలు నవలకి దగ్గర పోలికలున్నాయంటున్నారు.
అసలు గుంటూరు కారం, కీర్తి కిరీటాలు నవలకి ఎంత దగ్గర పోలికలున్నాయో అనేది సినిమా విడుదలైతే కానీ క్లారిటీ రాదు. కానీ ఈలోపులోనే కాపీ అనే వార్త విపరీతంగా వైరల్ గా మారింది.