జనవరి 13 న సంక్రాంతి సినిమాలతో పాటుగా విడుదల కావాల్సిన రవితేజ ఈగల్.. అంత హెవీ కాంపిటీషన్ లో థియేటర్స్ లో ఇరుక్కుని విడుదల కావడం ఎందుకు అని.. నిర్మాతల మండలిలో చర్చల అనంతరం తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. మొదటి నుంచి జనవరి 13 టార్గెట్ గానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. చివరి నిమిషంలో ఈగల్ ని పోస్ట్ పోన్ చేసారు. నిర్మాతల మండలిలో ఈగల్ కి సోలో డేట్ ఇస్తామనే ఒప్పందంతో ఈ సినిమాని సంక్రాంతి బరి నుంచి తప్పించారు.
అయితే ఈ జనవరి 26 న కానీ, ఫిబ్రవరిలో కానీ, మార్చి లో కానీ ఈగల్ థియేటర్స్ లోకి వస్తుంది అనుకున్నారు. తాజాగా ఈగల్ ని ఫిబ్రవరి 9 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.💥 మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.❤️🔥 మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు. 😎 అంటూ క్రేజీగా తేదీని ప్రకటించారు.
రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరావు నిరాశపరచడంతో ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు, కంటెంట్ మీదున్న నమ్మకంతో సంక్రాంతి సినిమాలతో పోటీకి సై అన్నాడు. చివరికి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. కొత్త డేట్ తో కొత్త ఈగల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.