గత ఏడాది వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన బాలకృష్ణ ఈ ఏడాది బాబీ తో చెయ్యబోతున్న మూవీని చకచకా ముగించేస్తున్నారు. వాల్తేర్ వీరయ్య హిట్ ఊపులో బాలయ్యని కథతో మెప్పించి సెట్స్ మీదకి తీసుకువెళ్లిన దర్శకుడు బాబీ.. విరామమే లేకుండా బాలయ్యతో కలిసి కష్టపడుతున్నాడు. ఇప్పటికే NBK109 షూటింగ్ సగానికి పైగా పూర్తి చేయడం జరిగింది అని తెలుస్తోంది. అయితే ముందుగా NBK109 ని ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఎన్నికల సమయానికల్లా విడుదల చేయాలనుకున్నారు.
కానీ అది ఇప్పడు సాధ్యంకాదు దసరాకి NBK109 విడుదలయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. దానితో మరో ఎనిమిది నెలలు బాలయ్య దర్శనం ఉండదు అని ఫాన్స్ ఫీలయ్యారు. కాని ఇప్పుడు NBK109 ని రేపు సమ్మర్ కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనే న్యూస్ చూసాక బాలయ్య ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మొదట ఈ సినిమాను దసరా కి విడుదల చేయాలని భావించినా.. ఇప్పుడు బాబీ - బాలయ్య ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని సమ్మర్ కి తెచ్చే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు.
మే నెలలో అనుకూలమైన డేట్ ని లాక్ చేసి ఆ తేదీని ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుంది అని ప్రీ లుక్ పోస్టర్ లోనే రివీల్ చేశారు.