యంగ్ టైగర్ నటిస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం దేవర నుంచి ఈ నెల 8 న రాబోతున్న గ్లిమ్ప్స్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్యాన్ ఇండియాలోని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జనవరి 1st కి దేవర గ్లిమ్ప్స్ ఇచ్చిన పోస్టర్ తో అందరిలో ఆసక్తి రేకెత్తించిన కొరటాల శివ.. ఇప్పుడు రాబోయే గ్లిమ్ప్స్ తో ఎంతెలాంటి హైప్ ఇస్తారో అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది. అటు ఎన్టీఆర్ ఫాన్స్ అయితే సోషల్ మీడియా రచ్చకి రెడీ అవడమే కాదు.. మిగతా ఫ్యాన్స్ కి ఏం చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నారు.
8 వ తారీఖున ఎవరు ఏ పనిలో ఉన్నా, Devara Glimpse వచ్చే టైమ్ కి X లో ఉండాలి.. ఫ్యాన్స్ అందరూ 🙌👌, ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నాడు @tarak9999 అన్న, సినిమా కి సంబంధించి ప్రతీ update ను బాగా పాపులర్ చేయాలి. ఎక్కడ విన్నా చూసినా దేవర సినిమా విషయాలే ఉండాలి.. మనకు.. 👍🔆 #DevaraGlimpseOnJan8 ✅ అంటూ ఎన్టీఆర్ వీరాభిమాని ఇచ్చిన ట్వీట్ తో మిగతా ఎన్టీఆర్ ఫాన్స్ అలెర్ట్ అవుతున్నారు.
దేవర గ్లిమ్ప్స్ వదలగానే హోరెత్తించే లైక్స్, షేర్స్ కామెంట్స్ తో ట్విట్టర్ X ని ఊపెయ్యడానికి సన్నద్ధమవుతున్నారు. మరి దేవర గ్లిమ్ప్స్ తోనే సంక్రాంతి హడావిడి మొదలు కావాలనేది ఎన్టీఆర్ ఫాన్స్ ప్లాన్ గా కనిపిస్తుంది.