Advertisementt

ఈరోజు నుంచి ఓటిటిలోకి హాయ్ నాన్న

Thu 04th Jan 2024 01:05 PM
hi nanna  ఈరోజు నుంచి ఓటిటిలోకి హాయ్ నాన్న
Streaming Today: Hi Nanna on Netflix ఈరోజు నుంచి ఓటిటిలోకి హాయ్ నాన్న
Advertisement
Ads by CJ

నాని హాయ్ నాన్న నేటి నుంచి ఓటిటిలో చూసేయండహో.. అంటూ మేకర్స్ హాయ్ నాన్న థియేటర్స్ లో విడుదలై నెల తిరక్కుండానే ఓటిటిలో విడుదల చేసేసారు. థియేటర్స్ లో ఆడియన్స్ ని  పలకరించిన  నాని నెల కాకుండానే మళ్ళీ ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు . డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాయ్ నాన్న ని రెండు తెలుగు ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవడంతో సినిమా హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాతో అడియన్స్ మనసులను, గుండెల్ని పిండేసాడు నాని. ఇక పది రోజులు తిరిగే లోపే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ సాధించేసి నాని కి సక్సెస్ ని కట్టబెట్టేసింది.

ఈచిత్రం జనవరి 19 కానీ, లేదంటే 26 న కానీ ఓటిటి లో రిలీజ్ అవ్వుద్ది అనుకున్నారు. కానీ హాయ్ నాన్న ఓటిటి పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ మాత్రం థియేటర్స్ లో డిసెంబర్ 7 న విడుదలైన హాయ్ నాన్న ని నెల తిరక్కుండానే ఓటిటిలోకి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు. జనవరి 4 అంటే నేటి నుంచి హాయ్ నాన్న ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Streaming Today: Hi Nanna on Netflix:

Hi Nanna streaming on Netflix

Tags:   HI NANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ