Advertisementt

గుంటూరు కారం: ఫైనల్లీ మీనాక్షి వచ్చేసింది

Thu 04th Jan 2024 12:18 PM
meenakshi  గుంటూరు కారం: ఫైనల్లీ మీనాక్షి వచ్చేసింది
Guntur Karam: Meenakshi Chaudhary has finally arrived గుంటూరు కారం: ఫైనల్లీ మీనాక్షి వచ్చేసింది
Advertisement
Ads by CJ

గుంటూరు కారం మూవీ అనౌన్స్ చేసినప్పుడు మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల అని చెప్పారు. ఆ తర్వాత హీరోయిన్ గా పూజ హెగ్డే తప్పుకోగా.. అప్పుడే ఫామ్ లోకి వచ్చిన మీనాక్షి చౌదరిని పూజ హెగ్డే ప్లేస్ లోకి తీసుకున్నారు అన్నా మేకర్స్ ఇంతవరకు మీనాక్షి పేరుని అఫీషియల్ గా ప్రకటించలేదు. అలాగే గుంటూరు కారం అప్ డేట్స్ లో ఎక్కడా ఈవెన్ పోస్టర్ లో కూడా మీనాక్షి చౌదరి లుక్ రివీల్ చెయ్యలేదు. మరో హీరోయిన్ శ్రీలీల లుక్ తో ఆమెకి బర్త్ డే విషెస్ చెప్పారు.

ఆ తర్వాత శ్రీలీలతో రెండు సాంగ్స్ రివీల్ చేసారు. ఇక ఇప్పటివరకు మీనాక్షి చౌదరి లుక్ మాత్రం రివీల్ చెయ్యలేదు, ఆమెని ఎందుకు దాస్తున్నారు అనుకున్నారు అందరూ. కానీ ఫైనల్ గా జనవరి 12 నా విడుదల కాబోతున్న గుంటూరు కారం కౌన్ డౌన్ పోస్టర్ లో మహేష్ వెనుకగా అనిలబడి ఆయన భుజాల మీద చేతులు వేసి ఉన్న రాజి కేరెక్టర్ లో మీనాక్షి చౌదరి లుక్ ని రివీల్ చేసారు మేకర్స్. మీనాక్షి చౌదరి గుంటూరు కారంలో చాలా సింపుల్ గా హాఫ్ సారీ లో కనిపించింది.

మీనాక్షి ఇప్పటివరకు చాలా సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. మహేష్ తో మాత్రం ట్రెడిషనల్ గా దిగబోతుంది. మరి మహేష్ కి ఈ రాజి ఏ మరదలిగానో కనిపించొచ్చు అనే ఊహాగానాలు మహేష్ ఫాన్స్ చేస్తున్నారు. కొంతమంది ఫైనల్లీ మీనాక్షిలుక్ ని పరిచయం చేసారు అంటున్నారు.

Guntur Karam: Meenakshi Chaudhary has finally arrived:

Photo Story: Meenakshi As Beautiful Raji In Guntur Karam

Tags:   MEENAKSHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ