నార్త్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న బిగ్ బాస్ షో సౌత్ లో మాత్రం కాంట్రవర్సీలకి కేరాఫ్ గానే నిలుస్తుంది. మొదట్లో బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ చూపించిన బుల్లితెర ప్రేక్షకులు మెల్లగా ఆ షోని లైట్ తీసుకుంటున్నారు. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం దానికి హైప్ తెచ్చేందుకు నానా తంటాలు పడుతుంది. ఈ సీజన్ 7 ని ఉల్టా ఫుల్టా అంటూ హోస్ట్ నాగార్జున దేనిని ఎత్తని రోజు లేదు. ఎలాగో ఈసారి కంటెస్టెంట్స్ చేసిన రచ్చ, బిగ్ బాస్ స్క్రిప్ట్స్ వలన ఈ సీజన్ బాగానే ఫేమస్ అయ్యింది.
కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినవాళ్ళు మాత్రం చాలా ముదుర్లు. అందులోను శివాజీ చాలా పెద్ద ముదురు. హౌస్ లోనే చాలామందిని మడతెట్టి ఇంటికి పంపించిన శివాజీ.. సీరియల్ బ్యాచ్ కి మొగుడు కింద తయారయ్యాడు. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక లాంటి వాళ్ళని తొక్కడానికి ట్రై చేసాడు. ఇక కొన్నిఎపిసోడ్ లో శివాజీ బిహేవియర్ అతన్ని మూడో స్థానానికే పరిమితమయ్యేలా చేసింది. హౌస్ ఎనుంచి బయటికొచ్చాక తనని లాస్ట్ నాలుగు వారాల్లో బ్యాడ్ చేసేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రయతనం చేసింది. తాను ఏం కష్టపడి చేసినా చిన్న ప్రశంశ దక్కలేదు.
కానీ కొంతమందిని(అమర్ ని ఉద్దేశించి) ఏం చెయ్యకపోయినా వారికి హైప్ ఇచ్చారు, హీరోని చెయ్యడానికి చూసారు. అది నేను బయటికొచ్చాకా కొన్ని ఎపిసోడ్స్ చూస్తే తెలిసింది. కావాలనే చేసారు. బాబుగారిని కూడా అడగలనుకుంటున్నాను, ఈ విషయంలో ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటానంటూ ఇంటర్వూస్ లో మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షో కాదు, స్క్రిప్టెడ్ అంటూ చాలామంది అంటున్నారు, ఇప్పుడు శివాజీ దానిని ప్రూవ్ చేసాడు. శివాజీనే కాదు.. గత సీజన్ లో వచ్చిన గీతూ రాయల్ కూడా నాగార్జున ఎపిసోడ్స్ చూడరు.. ఆయనకి స్క్రిప్ట్ ముందే వచ్చేస్తుంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మరి ఎంతగా కంటెస్టెంట్స్ తో అగ్రిమెంట్ రాయించుకుని పెదవి విప్పొద్దని చెప్పినా వారు ఇలా బహిరంగంగా హౌస్ లో జరిగిన ముచ్చట్లు మాట్లాడి బిగ్ బాస్ గుట్టురట్టు చేస్తున్నారు.