తమిళ దర్శకుడు విజయ్ తో పెళ్లి బందాన్ని విడాకులతో బ్రేక్ చేసుకుని కొన్నేళ్లు సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ.. సినిమాలు చెసుకుంటూ.. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన అమల పాల్ కి సినిమాల డిమాండ్ తగ్గిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఒయ్యారాలు ఒలకబోస్తూ కనిపించినా ఆమెకి సరైన అవకాశాలు రాలేదు. దానితో అమల పాల్ రెండో పెళ్ళికి సిద్ధమైంది. గుట్టు చప్పుడు కాకుండా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. ఒకరోజు సడన్ గా బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ని ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది.
నవంబర్ లో జగత్ దేశాయ్ ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని ఆ ఫొటోస్ ని షేర్ చేసిన అమల పాల్ రెండు నెలలు తిరగకుండానే అంటే కొత్త ఏడాదిలో అభిమానులకి శుభవార్త వినిపించింది. అంటే అమల పాల్ ఇప్పుడు ప్రెగ్నెంట్. అదే విషయాన్ని బేబీ బంప్ తో సహా అమల పాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అమల పాల్ ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న ఆమె ఫాన్స్, ఆమె స్నేహితులు సోషల్ మీడియా వేదికగా అమల కి జగత్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.