సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్ 1 పెను సంచలనం సృష్టిస్తూ ప్యాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ ఫిలిం గా నిలవడమే కాకుండా ఆ చిత్రంలో పుష్ప్ర రాజ్ కేరెక్టర్ కి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అందుకే పుష్ప కి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక కనిపిస్తుండగా.. యాంకర్ అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుంది.
అయితే ఇప్పుడు దర్శకుడు సుకుమార్ మరో కీలక పాత్ర కోసం TV9 లో యాంకర్ గా ఫెమౌస్ అయిన దేవి నాగవల్లిని పుష్ప పార్ట్ 2 లోకి తీసుకోబోతున్నారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేవి నాగవల్లి సుదీర్ఘ కాలంగా TV9 లో సీనియర్ న్యూ రీడర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ లోకి కూడా వెళ్లొచ్చిన దేవి నాగవల్లి ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో ఎలాంటి కేరెక్టర్ లో కనిపించబోతుందో అనే క్యూరియాసిటీ అయితే మొదలైపోయింది.
ఇక అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప ద రూల్ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ముగించేసి.. జులై నుంచి ప్రోపర్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.