ఈ సంక్రాంతి పండగ బాక్సాఫీసు ఫైట్ చాలా టైట్ గా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాగా రాబోతున్న హనుమాన్ ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా చాలా బలంగా హనుమాన్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నా ఆ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తమ సినిమా డేట్ మార్చుకోమని ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
నైజాం లో ఎంతగా మైత్రి వారు హనుమాన్ ని రిలీజ్ చేస్తున్నా.. హైదరాబాద్ లో హనుమాన్ కి కేవలం 4 థియేటర్లు ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద సిటీ లు అయిన హైదరాబాద్ సిటిలో నాలుగు థియేటర్స్ మాత్రమే కేటాయిస్తే, వైజాగ్ లో ఒక్క థియేటర్ కూడా ఇవ్వ లేదు, హనుమాన్, చిన్న సినిమాకి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పరిస్థితి ఇది అంటూ సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్ కనిపిస్తున్నాయి.
మరి జనవరి 12 న గుంటూరు కారంతో పోటీకి దిగుతున్న హనుమాన్, 13 న సైంధవ్, ఈగల్ తో ఢీ కొట్టాలి, ఇక జనవరి 14 భోగి రోజు నాగార్జున నా సామిరంగా మూవీతో పెట్టుకోవాలి. హనుమాన్ కంటెంట్ బావున్నా ఆ రెండుమూడు రోజులు హనుమాన్ ని ప్రేక్షకులు ఎంతవరకు పట్టించుకుంటారో అనేది క్లారిటీ లేదు. అటు థియేటర్స్ విషయంలోనూ హనుమాన్ కి అన్యాయం జరుగుతున్నట్టుగా ఆ కామెంట్స్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఇదంతా చూస్తుంటే హనుమాన్ ని తొక్కేస్తున్నట్టే కనిపిస్తోంది వ్యవహారం.