ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం, ఓ యాడ్ షూట్ కోసం దుబాయ్ వెళ్ళిన మహేష్ నేడో రేపో హైదరాబాద్ కి తిరిగిరానున్నారు. ఆయన హైదరాబాద్ కి రాగానే ఓ రోజు రెస్ట్ తీసుకుని గుంటూరు కారం ప్రమోషన్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ దుబాయ్ వెళ్లగా త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ లో తలమునకలై ఉన్నారు. గుంటూరు కారం ట్రైలర్ ని ఈ నెల 6న అంటే శనివారం విడుదల చేసేందుకు మేకర్స్ చూస్తున్నారు. ట్రైలర్ లాంచ్, అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ ఉంది.
అయితే ఈవెంట్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో మహేష్ ఫాన్స్ ట్వీట్స్ తో హంగామా మొదలు పెట్టారు. ఆ రోజు హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీసు గ్రౌండ్ లో జరగబోయే గుంటూరు కారం ఈవెంట్ కోసం వచ్చేవాళ్ళు, పాస్ ల కోసం ముందే మెసేజ్ పెట్టండి అంటూ వాళ్ళు హడావిడి చేస్తున్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే అదే రోజు ట్రైలర్ తో దుమ్మురేపబోతున్న గుంటూరు కారం జనవరి 12 న విడుదల కాబోతుంది
ఈ ఈవెంట్ అయ్యాక మహేష్ రెండు మూడు రోజులు పటు త్రివిక్రమ్ ఇంకా హీరోయిన్స్ తో కలిసి కొన్ని ఇంటర్వూస్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ పండక్కి గట్టిగా హిట్ కొట్టాలని మహేష్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. నిర్మాత నాగ వంశీ కూడా అదే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు.