సంక్రాంతి పండగకి విడుదలవుతున్న సినిమాల్లో పండగ కళ కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఎక్కువగా నా సామిరంగానే. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలయికలో జనవరి 14 భోగి రోజున రాబోతున్న ఈ చిత్రం అచ్చ తెలుగు ప్రేక్షకులకి, తెలుగు నేటివిటీకి సరిగ్గా సరిపోయే సినిమా కావడంతో దీనిపై మంచి అంచాలున్నాయి. నిన్నమొన్నటివరకు విడుదల తేదీ ఇవ్వకుండా కాస్త కన్ఫ్యూజ్ చేసిన నాగ్.. నా సామిరంగాని పండగ బరిలో దింపేస్తున్నట్టుగా కన్ ఫర్మ్ చేసారు.
అయితే ఇప్పుడు నా సామిరంగా కి పెట్టిన బడ్జెట్ లో మూడొంతులు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చేసినట్లుగా టాక్. అంటే డిజిటల్, శాటిలైట్, ఇంకా డబ్బింగ్ హక్కుల కింద నా సామిరంగా మేకర్స్ కి 32 కోట్లు డీల్ కుదిరిందట. అందులో స్టార్ మా శాటిలైట్ హక్కులని, హాట్ స్టార్ కి డిజిటల్ హక్కులని, ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ కి అన్నిటికి కలిపి 32 కోట్ల మేర మేకర్స్ కి రికవరీ అయినట్లుగా తెలుస్తుంది. అంటే నా సామిరంగా బడ్జెట్ అటు ఇటుగా 45 కోట్లు ఖర్చు కాగా.. అందులో నాన్ థియేట్రికల్ రైట్స్ కి 32 కోట్లు రావడమంటే మాములు విషయం కాదు.
మరి ఈ రకంగా చూస్తే నా సామిరంగా కి మంచి బేరం తగిలినట్లుగానే కనిపిస్తుంది. ఈ లెక్కన నా సామిరంగా నిర్మాతలకి సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టేస్తారు. అటు థియేట్రికల్ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లోనూ క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది.