మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలతో పాటుగా అక్కడ దుబాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కనిపిస్తున్న మహేష్ బాబు.. హైదరాబాద్ రాగానే గుంటురు కారం ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ఈ నెల 6 న గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ వేడుక జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే గుంటూరు కారం కంప్లీట్ అవడంతో మహెష్ ఫాన్స్ ఫోకస్ రాజమౌళితో చెయ్యబోయే SSMB29 పై పడింది.
రాజమౌళి ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్ మూవీని విడుదల చేసి అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. ఆస్కార్ సాధించాక రాజమౌళిపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. దానితో మహేష్ మూవీపై ప్యాన్ ఇండియా మార్కెట్ లో వియారీతమైన బజ్ ఉంది. ఆఫ్రికన్ జంగిల్ నుంచి యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు SSMB29 పై ఓ వార్త క్రేజీగా వైరల్ అయ్యింది.
మహేష్ తో రాజమౌళి చెయ్యబోయే చిత్రాన్ని ఎవరూ ఊహించని విధమైన భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారుట. ఆర్ఆర్ఆర్, బాహుబలి, బాహుబలి 2 సినిమాల కంటే డబుల్ గా ఈ సినిమా బడ్జెట్ ఉండబోతుందట. మొత్తం 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. SSMB29 కోసం హాలీవుడ్ సాంకేతికి నిపుణులను తీసుకోబోతున్నారట. రాజమౌళి ఇప్పటికే SSMB29 కోసం లొకేషన్స్ కూడా సెట్ చేసుకున్నారని వినికిడి.