మెగా ఫాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కారణం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై ఫైనల్ గా వారికో క్లారిటీ వచ్చింది. నిన్నమొన్నటివరకు ఇండియన్ 2 తో పాటుగా సాగిన గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పుడు మరో మలుపు తీసుకోబోతుంది. అంటే కమల్ హాసన్-శంకర్ ల ఇండియన్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయినట్లుగా వస్తున్న అప్ డేట్స్ తో మెగా ఫాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు.
ఈ నెలలో ఇండియన్ 2, ఫిబ్రవరిలో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసి అప్పుడు రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వెళ్లేముందు రిలీజ్ డేట్స్ లాక్ చెయ్యాలని శంకర్ చూస్తున్నట్టుగా తెలియడంతో మెగా ఫాన్స్ లో ఆనందం మొదలైంది. గేమ్ ఛేంజర్ మొదలై రెండున్నరేళ్లు గడిచినా.. ఇప్పటివరకు మెగా ఫాన్స్ లో అప్ డేట్స్ కోసం అసంతృప్తి, రిలీజ్ డేట్ ఇవ్వరు.. అందుకే శంకర్ పై, నిర్మాత దిల్ రాజు పై యుద్ధం మొదలు పెట్టారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇక వచ్చే నెలలో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టి దసరా లేదా అంతకన్నా ముందే వినాయక చవితికి గేమ్ ఛేంజర్ ని విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అది ఎప్పుడనేది ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ ఇస్తారని తెలుస్తుంది. ఇది చూసాకే మెగా ఫాన్స్ రిలాక్స్ అవుతున్నారు.. ఇప్పటికైనా ఓ కొలిక్కి తెచ్చావా శంకరా అంటూ సరదాగా కామెడీ చేస్తున్నారు.