చాలామంది కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఇకపై ఇది చేయాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం, కొత్త ఏడాదిలో అలా ఉంటామంటూ చెబుతారు. అందులో ఇప్పుడు హీరో వరుణ్ తేజ్ భార్య, మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠి కూడా చేసింది. గత ఏడాది వరుణ్ ని ప్రేమ వివాహమాడి మెగా ఫ్యామిలీలోకి కోడలిగా ఎంటర్ అయిన లావణ్య త్రిపాఠి ఇకపై సినిమాల్లో నటిస్తుందా.. లేదంటే మెగా కోడలిగా డిగ్నిటీ మైంటైన్ చేస్తుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఈకొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ లావణ్య త్రిపాఠి ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన లావణ్య త్రిపాఠి తన న్యూ ఇయర్ రెజెల్యుషన్స్ ని ఇన్స్టా స్టోరీస్ లో జత చేసింది. కొత్త ఏడాదిలో మరింత మానవత్వంతో ఉండాలని, తనపై తనకు మరింత ప్రేమని చూపిస్తూ సోషల్ మీడియా కి తక్కువ టైమ్ కేటాయించాలని, ఎక్కువ సమయాన్ని ప్రకృతి తో మమేకం అవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
మరి లావణ్య త్రిపాఠి తన కొత్త ఏడాదిని ఇలా స్టార్ట్ చేసి ఇకపై ఎలా ఉండాలనుకుంటుందో అనేది క్లారిటీ ఇచ్చేసింది. ఇక మెగా ఫ్యామిలీ పార్టీలో మెగా చిన్న కోడలిగా లావణ్య హుందాగా కనిపిస్తుంది.