అనసూయ ఈమధ్యన ఎక్కువగా జిమ్ లోనే కనిపిస్తుంది. 40 ప్లస్ లోకి ఎంటర్ అయ్యాక అనసూయ కాస్త బరువు పెరిగింది. శారీస్ లో ఆమె బరువు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. తరచూ పట్టు చీరల పబ్లిసిటీలో దర్శనమిస్తున్న అనసూయ తన భర్త తో కలిసి మరీ జిమ్ కి వెళుతుంది. ఇక 2023 ఏడాది చివరి రోజున ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో గడిపిన పిక్స్ వదిలిన అనసూయ.. న్యూ ఇయర్ స్పెషల్ గా వదిలిన పిక్ చూస్తే అనసూయ న్యూ ఇయర్ ని కూడా వదలట్లేదుగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అంటే అనసూయ న్యూ ఇయర్ 01-01-24 లో మొదటి రోజున కూడా జిమ్ లో కనిపించింది.. అది కూడా ఫ్యామిలీతో కలిసి.. అంటే కేవలం భర్తతోనే కాదు ఈసారి భర్త, పిల్లలిద్దరితో కలిసి అనసూయ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. అనసూయ పిల్లలు కూడా బొద్దుగాముద్దగా ఉంటారు. వాళ్ళని కూడా సన్నబడేలా చెయ్యాలని అనసూయ ఇలా వాళ్ళకి సెలవు రోజు న్యూ ఇయర్ అయినా వదలకుండా జిమ్ కి తీసుకుపోయి వర్కౌట్స్ చేపిస్తూ.. మీరు ఇలానే ఫ్యామిలీతో కలిసి వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా ఉండమని చెప్పకనే చెప్పింది.
ఇక ఆ ఫొటోతో పాటుగా అనసూయ ఎప్పుడూ తన ఫ్యామిలీతో కలిసి గడపడానికి ఇష్టపడతాను అని.. ఇక కొత్త రోజు, కొత్త నెల, కొత్త యేడాది ఇలా మొదలయ్యింది అంటూ అనసూయ ఆ పిక్ కి క్యాప్షన్ పెట్టింది.