యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ న్యూ ఇయర్ వేడుకల కోసం అలాగే చిన్నపాటి వెకేషన్ అంటూ భార్య పిల్లలతో కలిసి జపాన్ వెళ్లారు. తారక్ కి జపాన్ చాలా ప్రత్యేకం. అక్కడ ఆయనకి వీరాభిమానులు ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ కి జపాన్ లో క్రేజ్ బాగా పెరిగింది. అందుకేనేమో.. ఈసారి తారక్ న్యూ ఇయర్ కోసం జపాన్ దేశాన్ని ఎంచుకుని లక్ష్మి ప్రణతి, భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి జపాన్ ఫ్లైట్ ఎక్కారు అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ జపాన్ లో ఓ వారం రోజులపాటు ఎంజాయ్ చేసి న్యూ ఇయర్ రోజునే తిరిగి ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ కి వచ్చేసారు.
ఆయన నటిస్తున్న దేవర కొత్త షెడ్యూల్ లో పాల్గొనేందుకు తారక్ చాలా త్వరగా వెకేషన్ ముగించేసారు. తారక్ ఇలా హైదరాబాద్ లో దిగారో లేదో.. అక్కడ జపాన్ ని భారీ భూకంపం కుదిపేసింది. తీవ్ర భూకంపం రావడంతో జపాన్ లో భారీ నష్టమే జరిగింది. దానితో ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కి చేరుకోవడంతో ఆ ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.
అయితే జపాన్ లో భూకంపం సంభవించడంతో తాను షాక్ అయ్యానని, గత వారంరోజులుగా తాను అక్కడే ఉన్నాను.. ఈ విపత్తుతో బాధపడినవారంతా త్వరగా కోలుకోవాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా, కష్టకాలంలో జపాన్ ప్రజలు ధైర్యానికి కృతఙ్ఞతలు అంటూ ట్వీట్ చేసారు ఎన్టీఆర్.