యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో రాబోతున్న దేవర నుంచి న్యూ ఇయర్ స్పెషల్ గా పోస్టర్ తో పాటుగా టీజర్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. గత ఏడాది ఇదే న్యూ ఇయర్ దేవర విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ఈ ఏడాది టీజర్ డేట్ లాక్ చేసి పవర్ ఫుల్ పోస్టర్ వదిలారు. ఎన్టీఆర్ దేవర మాస్ లుక్ తో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగానే ఉన్నారు. కానీ కామన్ ఆడియన్స్ మాత్రం దేవర సెకండ్ లుక్ పై సెటైర్స్ వేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఎన్టీఆర్ పడవ చివరి అంచున నించుని కనిపించాడు.. ఇది వాల్తేర్ వీరయ్యలో మెగాస్టార్ చిరు ఉన్నట్టుగా ఉంది అని ఒకరంటే.. మరొకరు వేణు మాధవ్ తలని ఎన్టీఆర్ బాడీకి అతికించి ట్రెండ్ చేస్తూ టైగర్ సత్తిగా వేణుమాధవ్ లక్ష్మి మూవీలో కనిపించినట్టుగా ఉంది ఎన్టీఆర్ ని చూస్తే అంటున్నారు. ఇంకొందరు.. దేవర, వాల్తేర్ వీరయ్య లుక్స్ లో వాల్తేర్ వీరయ్య లుక్ బావుంది అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి దేవర గెటప్ సెట్ కాలేదంటున్నారు.
ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లోనే బావున్నాడు, దేవరగా తేలిపోతున్నాడు. ఆయన ఆహార్యం సరిపోవట్లేదు.. ఇది కాస్త ఆలోచించండి అంటూ కొరటాలకి సలహా ఇస్తున్నారు. కానీ మరికొందరు ఆగండాగండి.. టీజర్ వచ్చాక అసలు దేవర కనిపిస్తాడు. అప్పుడు మాట్లాడంటూ కౌంటర్ ఎటాక్స్ చేస్తున్నారు. ఇలా ఉన్నాయి ఎన్టీఆర్ దేవర న్యూ పోస్టర్ పై సోషల్ మీడియా కామెంట్స్.