సీతారామం ప్యాన్ ఇండియా ఫిలిం సక్సెస్ తర్వాత తొందరపడకుండా ఏరి కోరి అవకాశాలు ఎంచుకుంటున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం క్రేజీ తారగా మారిపోయింది. సీతారామం తర్వాత ఆమె హాయ్ నాన్న తో హిట్ కొట్టింది. నాని-మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన హాయ్ నాన్న ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టడంలో మృణాల్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఆమె కూడా కథ, హీరోలను చూసి ప్రాజెక్ట్స్ సైన్ చేస్తుంది.
ఇక కొత్త ఏడాది ఆరంభంలోనే ఫ్యామిలీ స్టార్ అంటూ విజయ్ దేవరకొండ తో కలిసి మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. తర్వాత మృణాల్ ఠాకూర్ కి మెగాస్టార్ విశ్వంభర లో అవకాశం వచ్చింది అనే న్యూస్ నడుస్తుంది. అయితే అది నిజమా.. కాదా అనేది తెలియాల్సి ఉండగా.. ఇప్పుడు మృణాల్ కి లారెన్స్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందట. అది ఒక్కటి కాదు, రెండు సినిమాల్లో ఆ అవకాశం మృణాల్ ని వరించినట్లుగా తెలుస్తుంది.
రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి శ్రీరామ రక్ష అనే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలోనే లారెన్స్ తో మృణాల్ రొమాన్స్ చెయ్యబోతుందట. అలాగే తమిళ దర్శకుడు రవికుమార్‌తో లారెన్స్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులోనూ మృణాల్‌నే హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. మరి ఇవన్నీ మృణాల్ రేంజ్ ని తెలియజేసే సినిమాలే కదా!