Advertisementt

సైలెంట్ గా ఓటిటిలోకి సుడిగాలి సుధీర్ సినిమా

Mon 01st Jan 2024 07:31 PM
sudigali sudheer  సైలెంట్ గా ఓటిటిలోకి సుడిగాలి సుధీర్ సినిమా
Calling Sahasra Movie Now Streaming on Amazon Prime Video సైలెంట్ గా ఓటిటిలోకి సుడిగాలి సుధీర్ సినిమా
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ కి భీభత్సమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం బుల్లితెర మీద కనిపించకుండా సుధీర్ సిల్వర్ స్క్రీన్ పై బిజీగా వున్నాడు. హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఫలితాలు తారుమారైన సుధీర్ మాత్రం ఎప్పుడూ సినిమాలు చేస్తూ బిజీగానే కనిపిస్తున్నాడు. గాలోడు సినిమా అట్టర్ ప్లాప్ అయినా.. నిర్మాతలకు ఆ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అటు ఓటిటిలోను గాలోడు హిట్ గానే నిలిచింది. ఆ తర్వాత కాలింగ్ సహస్ర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ చిత్రం కూడా సుధీర్ ని బాగా నిరాశపరిచింది. కాలింగ్ సహస్ర అసలు ఎప్పుడు థియేటర్స్ లో విడుదలయ్యిందో కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రం చడీచప్పుడు లేకుండా సైలెంట్ గా ఓటిటిలోకి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. సుధీర్ కాలింగ్ సహస్ర అమెజాన్ ప్రైమ్ నుంచి ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యింది. దానితో సుడిగాలి అభిమానులే షాకైపోతున్నారు. ఇదేమిటి ఇంత సైలెంట్ గా సుధీర్ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది అని మాట్లాడుకుంటున్నారు.

Calling Sahasra Movie Now Streaming on Amazon Prime Video:

Sudigali Sudheer Calling Sahasra Movie Now Streaming on Amazon Prime Video

Tags:   SUDIGALI SUDHEER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ