Advertisementt

భార్య నమ్రతతో కలిసి మహేష్ అలా..

Mon 01st Jan 2024 05:34 PM
mahesh babu  భార్య నమ్రతతో కలిసి మహేష్ అలా..
Mahesh Babu New Year Spark in Dubai భార్య నమ్రతతో కలిసి మహేష్ అలా..
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం భార్య పిల్లలతో కలిసి దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక దేశంలో న్యూ ఇయర్ వేడుకలని జరుపుకునే మహేష్ బాబు ఈసారి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళ్లారు. అక్కడొక యాడ్ షూట్ కంప్లీట్ చేసుకుని నేడు న్యూ ఇయర్ కి భార్య, పిల్లలు ఫ్రెండ్స్ తో కలిసి స్వాగతం పలికారు. గౌతమ్, సితార, నమ్రతతో కలిసి మహెష్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వైరల్ గా మారగా..

మహేష్ బాబు ప్రత్యేకంగా ఇన్స్టా పేజీ లో నమ్రతతో ప్రేమగా ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. Spontaneity. Laughter. Love. Adventure. Growth. #HappyNewYear #2024 ❤️ అంటూ భార్యకి న్యూ ఇయర్ విషెస్ తెలియజేసాడు. ఆ పిక్ లో నమ్రత హ్యాపీగా మహేష్ భుజంపై వాలాగా.. మహేష్ ఆమె మొహాన్ని ప్రేమతో పట్టుకున్న పిక్ అది. ఆ పిక్ చూసి అభిమానులు కూడా ఇంత మంచి జంటకు ఏ దిష్టి తగలకూడదు అంటున్నారు. 

ఇక మహేష్ గుంటూరు కారంతో మరో 12 రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిమానులే కాదు.. పండగ కోసం ఎంతగా ఎదురు చూస్తారో.. ఇప్పుడు గుంటూరు కారం కోసం కూడా ప్రేక్షకులు అంతగానే ఎదురు చూస్తున్నారు.

Mahesh Babu New Year Spark in Dubai:

Mahesh Babu shares adorable pic on wife Namrata

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ