యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు దేవర దర్శనమైంది. న్యూ ఇయర్‌ని పురస్కరించుకుని అభిమానులకు స్వామి దర్శనమిచ్చాడు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దేవరపై ఎటువంటి న్యూస్ వస్తున్నాయో.. ఏ రేంజ్‌లో ట్రెండ్ బద్దలవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఒక కారణమైతే.. మరో కారణం దేవర చిత్ర నిర్మాతలలో ఒకరు, ఎన్టీఆర్ సోదరుడైన కళ్యాణ్ రామ్ మరో కారణం. అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా టీజర్ అంటూ చిన్న హింట్ వదిలితే.. డెవిల్ ప్రమోషన్స్‌లో ఆ సినిమా కంటే ఎక్కువగా దేవర గురించి కళ్యాణ్ రామ్ చెబుతూ.. సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు.
ఇక న్యూ ఇయర్‌కి టీజర్ వస్తుందని అంతా ఊహించుకుంటున్నారు. కాకపోతే టీజర్‌కు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో కాస్త నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కి డిసెంబర్ 31 అర్థరాత్రి దేవర దర్శనానికి సంబంధించి మేకర్స్ అప్డేట్ వదిలారు. అర్థరాత్రి ప్రకటించినట్లే.. దేవర పోస్టర్ వదిలి ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేశారు. అంతేకాదు, దేవర గ్లింప్స్‌కు సంబంధించిన అప్డేట్ కూడా ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. దేవర గ్లింప్స్‌ను జనవరి 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఇందులో ప్రకటించారు.
ఇక ఇయర్ ఆఫ్ ఫియర్ అంటూ వచ్చిన ఈ పోస్టర్‌లో.. టైగర్ విశ్వరూపం చూడబోతున్నారనేలా హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే సముద్రం మధ్యలో ఓ భారీ యాక్షన్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇందులో తారక్ లుక్.. వేటకు సిద్ధమైన పులిని తలపిస్తోంది. అదే సమయంలో కాస్త ఆర్ఆర్ఆర్ లోని కొమరం భీమ్ లుక్ కూడా ఇందులో కనిపిస్తుండటం గమనార్హం. మొత్తంగా అయితే.. 2024కి యంగ్ టైగర్ గ్రాండ్‌గా ఈ పోస్టర్‌తో వెల్‌కమ్ చెప్పారు. ఫ్యాన్స్‌కి 2024 మనదే అనే ఫీల్ ఇచ్చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.