RX 100 తర్వాత అంతటి హిట్ కోసం ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసిన పాయల్ రాజపుట్ మళ్ళీ అదే RX100 డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం మూవీతో హిట్ అందించాడు. మంగళవారం మూవీలో పాయల్ రాజ్ ఫుట్ నటనకు ప్రేక్షకులు శెభాష్ అనడమే కాదు.. సినిమాని హిట్ చేసారు. చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురు చూసిన పాయల్ కెరీర్ ని మంగళవారం నిలబెట్టింది.
అయితే 2023 కి బై బై చెప్పేసి 2024 కి సెలెబ్రేషన్స్ తో వెల్ కమ్ చెబుదామనుకున్న పాయల్ రాజపుట్ ఇంట్లో విషాదం నెలకొంది. పాయల రాజ్ ఫుట్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆమె పెంపుడు కుక్క క్యాండీ చనిపోయింది. దానితో పాయల్ ఎమోషనల్ అవుతూ.. నీ హగ్ ని, నీ ప్రేమని మాస్ అవుతాను.. ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా ఉంది. నిన్ను ఎంతగానో ప్రేమించాను. ఇకపై నిన్ను నా లైఫ్ లాంగ్ మిస్ అవుతాను.
ప్రేమంటే ఏమిటో తెలిసేలా చేసావు, నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. అంటూ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ కి పలువురు స్పందిస్తున్నారు. అంతేకాకుండా పాయల్ పోస్ట్ కి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా స్పందించాడు.