హీరోయిన్ సమంత చాలా రోజులుగా సినిమాలు చెయ్యడం లేదు, ఖుషి షూటింగ్ చక చకా పూర్తి చేసి ప్రమోషన్స్ చెయ్యకుండానే అమెరికా వెళ్ళిపోయి అక్కడ హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంది. మధ్య మధ్యలో సమంత వర్కౌట్ వీడియోస్ తో పాటుగా ఫ్యాషనబుల్ ఫోటో షూట్స్ వదులుతుంది. అలాగే యాడ్ షూట్స్ లో పాల్గొంటుంది తరచూ కొత్త కొత్తగా గ్లామర్ పిక్స్ వదులుతుంది. అయితే ఇన్ని చేస్తున్నా సమంత మాత్రం కొత్త సినిమాలని ఒప్పుకోలేదు. కొత్త కథలని వినలేదు కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చెయ్యలేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం సమంత చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఫోటో షూట్స్ వదలడం మీదే ఫోకస్ పెట్టిందా అనేలా ఆమె బిహేవియర్ ఉండేది, ఇక ఎప్పుడు న్యూ ఇయర్ ని విదేశాల్లో సెకెబ్రేట్ చేసుకునే సమంత, నాగ చైతన్యకి విడాకులిచ్చాకా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. మరి ఈ ఏడాది ఎక్కడికి వెళ్లిందో తెలియదు కానీ.. సమంత ఈ ఏడాది చివరిగా ఇంట్రెస్టింగ్ గా ఓ వర్కౌట్ వీడియో వదిలింది.
100 కేజీల బరువు పైకెత్తిన వర్కౌట్ వీడియోని వదులుతూ.. 2023 చివరి వీడియో అంటూ పోస్ట్ చేసింది. నిజంగా సమంత ఫిట్ గా అన్ని కేజీల బరువుని సునాయాసంగా ఎత్తేస్తూ నవ్వుతూ కనిపించిన ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.