Advertisementt

సడెన్‌గా ట్రెండ్‌లోకి.. ఖుషి 4K

Tue 02nd Jan 2024 01:49 PM
kushi 4k  సడెన్‌గా ట్రెండ్‌లోకి.. ఖుషి 4K
Pawan Kalyan Movie Kushi4K in Trending సడెన్‌గా ట్రెండ్‌లోకి.. ఖుషి 4K
Advertisement
Ads by CJ

థియేటర్‌లో బొమ్మ లేదు.. హీరో కూడా యాక్టివ్‌గా లేడు అయినా కూడా ఆయనెప్పుడో చేసిన సినిమా సడెన్‌గా సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అదేంటి.. సమయం, సందర్భం లేకుండా అలా ఎలా ట్రెండ్ అవుతుందని అనుకుంటున్నారా? అందుకే అనేది.. కాదేది ట్రెండ్‌కు అనర్హం అని. విషయంలోకి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కాంబినేషన్‌లో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి. ఈ సినిమా అప్పట్లో సంచనాలను క్రియేట్ చేయగా.. సరిగ్గా సంవత్సరం క్రితం 4K వెర్షన్‌లో రీ రిలీజై.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.

ఇప్పుడీ 4K రీ రిలీజే ఈ సినిమా టైటిల్ ట్రెండ్ అవడానికి కారణంగా తెలుస్తోంది. 2022 డిసెంబర్ 31న ఖుషి 4K (#Kushi4K) విడుదలైంది. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌కి థియేటర్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేసి.. ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు నెటిజన్లు అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31కి ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ పోస్ట్ చేస్తుండటం విశేషం. మొత్తంగా అయితే.. ఖుషి 4K  రీ రిలీజైన సంవత్సరం తర్వాత కూడా ఇలా ట్రెండ్ లోకి రావడం మాత్రం విశేషమనే చెప్పుకోవాలి.

అందుకే అంటారు పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ కాదు.. భక్తులు ఉంటారనేది. విషయమేదీ లేకపోయినా.. వారు అక్కడ స్పేస్ తీసుకుని మరీ.. అభిమానం చాటుకోవడం అంటే మాములు మ్యాటర్ కాదు కదా. ఏమో.. కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31కి ఈ సినిమాని రీ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

Pawan Kalyan Movie Kushi4K in Trending:

Fans Celebrates Kushi4K One Year Celebrations

Tags:   KUSHI 4K
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ