సంక్రాంతికి గట్టి పోటీ నడుస్తుంది. పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు దిగడంతో ఈసారి కోడి పందేలకన్నా ఎక్కువగా బాక్సాఫీసు హాట్ హాట్ గా మారిపోయింది. ఆంధ్రలో కోడి పందేలు ఫేమస్, కానీ ఈసారి బాక్సాఫీసు బరి మరింత ఫేమస్ అయ్యింది. గుంటూరు కారం లాంటి పెద్ద చిత్రంలో హనుమాన్, ఈగల్, సైంధవ్ లతో పాటుగా నాగార్జున కూడా నా సామిరంగాని సంక్రాంతిమే రిలీజ్ అంటూ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.
విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న ఈచిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పోస్టర్స్ నుంచే భీభత్సమైన క్రేజ్ కనిపిస్తున్న నా సామిరంగా ప్రమోషన్స్ ప్రోపర్ గా మొదలు కాకపోవడంతో.. మిగతా గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, హనుమాన్ ప్రమోషన్స్ దూసుకుపోతుండడంతో.. నాగార్జున ఏమైనా సంక్రాంతి నుంచి తప్పుకున్నారా అనే టాక్ మొదలైంది. గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్ లతో స్క్రీన్లు పంచుకుంటే ఓపెనింగ్స్ రావు, రెవిన్యూ రాదు.
ఇక గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్ అన్ని ప్రోపర్ గా డేట్స్ లాక్ చేసినా.. నా సామిరంగా ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వకుండా సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. నా సామిరంగా నుంచి ఏ అప్ డేట్ వచ్చినా దానిలో పండగ రిలీజ్ అంటున్నారు తప్ప డేట్ మాత్రం ఫిక్స్ చెయ్యడం లేదు. అయితే ఇప్పుడు నాగార్జున కూడా కన్ ఫర్మ్ చేసారు. జనవరి 14 భోగి స్పెషల్ గా నా సామిరంగా విడుదల అంటూ పోస్టర్ వేసి ప్రకటించేసారు. మరి ఈ లెక్కన సంక్రాంతికి నాగార్జున కూడా వార్ ప్రకటించడమే కదా..!