సంక్రాంతి బాక్సాఫీసు బరిలో భారీ బడ్జెట్ సినిమాలని ఢీ కొట్టబోతున్న హనుమాన్ గురించిన టాపిక్కే సోషల్ మీడియాలో నడుస్తుంది. హనుమాన్ మూవీ మేకర్స్ తాము ముందుగా రిలీజ్ డేట్ ఇచ్చామంటూ వారు సంక్రాంతి బరి నుంచి తప్పుకోమన్నా తప్పుకోకుండా ఈ పండక్కి రిలీజ్ అంటూ ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. హీరో తేజ సజ్జా తో కలిసి దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ ని తెగ ప్రమోట్ చేస్తున్నాడు.
తాజాగా ప్రశాంత్ వర్మ హనుమాన్ కి ప్రభాస్ అండగా నిలుస్తారు. ఆయనని కలిసి హనుమాన్ రిలీజ్ గురించి చెప్పాను. విడుదల సమయానికి ఏదో ఒక ప్రమోషన్స్ లో ప్రభాస్ భాగమవుతారని ప్రశాంత్ వర్మ చెప్పారు. ఇక బాలకృష్ణ గారు నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ హనుమాన్ కి తనవంతు సహకారం అందిస్తామని మాటిచ్చారు అంటూ ప్రశాంత్ వర్మ తన వెనుక స్టార్ హీరోల బలం ఉంది అంటూ చెప్పకనే చెప్పాడు.
ఇక హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 7 నే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈవెంట్ కి బాలయ్య గెస్ట్ గా రావొచ్చేమో చూడాలి.