Advertisementt

గుంటూరు కారం: మడతపెట్టేసారుగా

Sat 30th Dec 2023 09:37 PM
guntur kaaram  గుంటూరు కారం: మడతపెట్టేసారుగా
Guntur Kaaram Song Kurchi Madathapetti is Out Now! గుంటూరు కారం: మడతపెట్టేసారుగా
Advertisement
Ads by CJ

గుంటూరు కారం నుంచి వచ్చిన రెండు సాంగ్స్ అభిమానులని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. దానితో మూడో సాంగ్ తో అభిమానులని ఊపెయ్యలనే కసితో థమన్ మరియు త్రివిక్రమ్ ప్లాన్ చేసి మరీ మూడో పాటగా హై వోల్టేజ్‌ మాస్‌ నంబర్‌ కుర్చీ మడతపెట్టిని విడుదల చేసారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను మరింత మాస్‌గా మరియు ఎనర్జిటిక్‌గా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ పాటను విడుదల చేసింది.

ఈ పాటలో అదిరిపోయే బీట్‌లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి మరియు తూనీగ నడుములోన తూటాలెట్టి ... తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి.. వంటి లిరిక్స్ తో మహేష్-శ్రీలీల డాన్స్ స్టెప్పులతో నిజంగానే మడతపెట్టేశారనిపించేలా ఈ సాంగ్ అభిమానులకి బాగా ఎక్కేసింది.

శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ స్టెప్పులకు థియేటర్లు ఖచ్చితంగా షేక్ అవుతాయి.

Guntur Kaaram Song Kurchi Madathapetti is Out Now! :

Kurchi Madathapetti song from Guntur Kaaram

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ