నాని కొంతకాలంగా తన సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసిన చాలా కొద్దిరోజులు అంటే నెల తిరక్కుండానే ఓటిటి రిలీజ్ చేసేస్తున్నాడు. మార్చ్ 30 న థియేటర్స్ లోకి వచ్చిన దసరా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మిగతా భాషల్లో ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా కలెక్షన్స్ దుమ్మురేపింది. కానీ ఆ చిత్రం థియేటర్స్ లో ఉండగానే ఓటిటిలో రిలీజ్ చేశారు. నెల తిరక్కుండానే దసరా ఓటిటిలోకి రావడంతో అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు కూడా నాని అలానే తొందరపడ్డాడు అంటున్నారు. నాని లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ఈ నెల 7 న విడుదలైంది. ఇప్పటికి హాయ్ నాన్న ఓవర్సీస్ లో బాగానే ఆడుతుంది. కానీ ఇంతలోనే హాయ్ నాన్న కి ఓటిటి డేట్ లాక్ చేసి పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న హాయ్ నాన్న థియేటర్స్ లో విడుదలైన నెల లోపులోనే జనవరి 4 న ఓటిటి రిలీజ్ అని ప్రకటించారు. అదిచూసి అందరూ నాని ఎందుకింత తొందర అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలు విడుదలైన నెలలోపులోనే ఓటిటి స్ట్రీమింగ్ చేసేందుకు నాని మేకర్స్ ముందుగా ఒప్పందం చేసుకోబట్టే ఇలా జరుగుతుంది. ప్లాప్ సినిమాలు నెల లోపులో ఓటిటిలోకి వచ్చినా ఓకె.. కానీ హిట్ సినిమాలు అలా నెల తిరక్కుండానే ఓటిటిలో విడుదలైతే థియేటర్స్ మొహం ఎవరు చూస్తారు.