2024 సంక్రాంతికి బాక్సాఫీసు బరి దగ్గర గట్టి పోటీనే కనిపిస్తుంది. అంత పోటీ ఎందుకు ఎవరైనా తప్పుకుంటే తర్వాత సోలో డేట్ ఇస్తాము అంటూ దిల్ రాజు చెప్పినా ఎవ్వరూ తగ్గట్లేదు. ముందు నుంచి కచ్చిఫులు వేసుకున్నాము, మేమె ముందు డేట్ లాక్ చేశామని పట్టుబడుతున్నారు. మహేష్ గుంటూరు కారం, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, అలాగే తమిళం నుంచి ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీస్ సంక్రాంతికి పోటీపడుతున్న చిత్రాలు. ఈ చిత్రాల మేకర్స్ కలిసి కూర్చుని సమస్య సాల్వ్ చేద్దామంటే ఎవ్వరూ తప్పుకోనంటున్నారు. దానితో సిస్ట్యువేషన్ మరీ టైట్ అయ్యింది.
అయితే ముందుగా ఈ మీటింగ్ కి హనుమాన్ నిర్మాత హాజరవలేదు అన్నారు. ఆ తర్వాత హనుమాన్ నిర్మాతతో దిల్ రాజు భేటీ అయ్యారు. ఈలోపులో హనుమాన్ నైజాం రైట్స్ ని మైత్రి మూవీ వారు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. దానితో నైజాం లో మైత్రి vs దిల్ రాజు అన్న రేంజ్ లో థియేటర్స్ గొడవ మొదలైంది. ఇప్పడు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తమని సంక్రాంతి బరి నుంచి తప్పుకోమని బెదిరిస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హనుమాన్ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పించమని తమని బెదిరున్నారంటూ ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పర్సన్ ఎవరో మాకు తెలీదు, ఎవరు చేయిస్తున్నారో కూడా మాకు తెలియదు, అడుగడుగునా అడ్డంకులు అయితే క్రియేట్ అవుతున్నాయి, రీసెంట్ గా సెన్సార్ విషయంలో అడ్డు పడ్డారు.. అని ప్రశాంత్ వర్మని బెదిరించినట్టుగా ఆయన ఈ కాంట్రవర్సీ కామెంట్స్ చేసారు. మరి నిజంగానే హనుమాన్ ని తప్పుకోమని ఎవరైనా బెదిరించారా.. అయితే అది ఎవరై ఉంటారు అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి.