Advertisementt

దుబాయ్ యాడ్ షూట్ లో మహేష్

Sat 30th Dec 2023 12:49 PM
mahesh  దుబాయ్ యాడ్ షూట్ లో మహేష్
Mahesh off to Dubai for an AD shoot దుబాయ్ యాడ్ షూట్ లో మహేష్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఈ గురువారమే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసేసారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న గుంటూరు కారం షూట్ కంప్లీట్ కాగానే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు కోసం దుబాయ్ వెళ్ళారు. నిన్న శుక్రవారమే మహెష్, నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి దుబాయ్ వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే న్యూ ఇయర్ వేడుకల కోసమేకాదు.. మహేష్ దుబాయ్ వెళ్ళింది. అక్కడొక యాడ్ షూట్ లో మహేష్ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అదే విషయాన్ని నేడు మహేష్ బాబు, నమ్రత ఇంకా కొంతమంది టెక్నీకల్ టీమ్ తో కలిసి వున్న ఫొటోతో కన్ ఫర్మ్ అయ్యింది. మహేష్ బాబు స్టైలిష్ గా కుర్చీలో కూర్చోగా.. మహేష్ టీమ్ తో కలిసి సందడి చేసిన పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక యాడ్ షూట్ పూర్తి కాగానే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.

ఇక మహేష్ గుంటూరు కారం నుంచి నేడు మిర్చి ఘాటులాంటి కుర్చీ మడతపెట్టి సాంగ్ ని వదులుతున్నారు మేకర్స్. అది ఈరోజు సాయంత్రం 4 గంటలకి విడుదల చేస్తున్నట్టుగా గుంటూరు కారం మేకర్స్ ప్రకటించారు.

Mahesh off to Dubai for an AD shoot:

Mahesh in Dubai ad shoot

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ