Advertisementt

ముందుగానే ఓటిటిలోకి హాయ్ నాన్న

Sat 30th Dec 2023 10:54 AM
hi nanna  ముందుగానే ఓటిటిలోకి హాయ్ నాన్న
Hi Nanna tentative OTT release date is here ముందుగానే ఓటిటిలోకి హాయ్ నాన్న
Advertisement
Ads by CJ

నాని-మృణాల్ ఠాకూర్ జంటగా డిసెంబర్ 7 న విడుదలైన హాయ్ నాన్న మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. మొదటి పది రోజులకే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ చేరుకుంది. మిగతా ప్యాన్ ఇండియా భాషల్లో హాయ్ నాన్న ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రం నాని సినిమాకి పట్టం కట్టారు. తండ్రి-కూతుళ్ళ అనుబంధంతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్ లో ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

అయితే థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకున్న హాయ్ నాన్న ఎప్పుడెప్పడు ఓటిటిలో వస్తుందా.. ఏ ఓటిటిలో వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. హాయ్ నాన్న డిజిటల్ హక్కులని దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నెలన్నర తర్వాతే ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తుంది.. అది జనవరి మూడో వారంలో అంటే జనవరి 19 కానీ, లేదంటే జనవరి 26న కానీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా  ప్రచారం జరిగింది.

కానీ నెట్ ఫ్లిక్స్ హాయ్ నాన్న చాలా ముందుగా అంటే నెల కూడా తిరక్కుండానే జనవరి 4 న స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా పోస్టర్ చేసి ప్రకటించారు. డిసెంబర్ 7 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం జనవరి 4 న నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. 

 

Hi Nanna tentative OTT release date is here:

Hi Nanna OTT Release Date And Platform Locked

Tags:   HI NANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ