ఒక ఏడాది ఒకరికి ప్లస్ అవ్వొచ్చు.. మరొకరికి మైనస్ అవ్వొచ్చు. ఒకరికి జీవితంలో ఎన్నడూ లేనంత అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. మరొకరికి పెను దరిద్రాన్ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇక పార్టీల విషయానికి వస్తే.. తెలంగాణలో దశాబ్ద చరిత్రను కాలరాసి.. అదే దశాబ్ద కాలంగా కునారిల్లుతున్న పార్టీకి పట్టంగట్టింది. ఇక ఏపీ విషయానికి వస్తే మూడేళ్ల పాటు నిర్మించుకున్న జగన్ సామ్రాజ్యాన్ని కూలదోసి టీడీపీకి భారీ హైప్ ఇచ్చేసింది. కూల్చివేతలతో ప్రారంభించుకున్న జగన్ సామ్రాజ్యాన్ని కూల్చివేసేందుకు జనం సిద్ధమయ్యేలా చేసింది 2023 కావడం గమనార్హం. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాముఖ్యాన్ని తెలియజేసింది కూడా ఈ ఏడాదే.
చక్కబెట్టేందుకు ఐదేళ్లు చాలవు..
చిటికేస్తే పనులు అయిపోవాలి అంటే అవ్వవు. దానికి కాస్త టైం పడుతుంది. అలాగే ఏపీ చాలా దారుణమైన స్థితిలో చంద్రబాబు చేతుల్లోకి వెళ్లింది. మెల్లమెల్లగా ఆయన పనులు చక్కబెట్టుకు రావడం స్టార్ట్ చేశారు. విశాఖను హుద్ హుద్ తుఫాన్ సర్వనాశనం చేస్తే అక్కడే ఉండి పరిస్థితులను సరి చేశారు. రైతులను రాజధానికి భూములు ఇచ్చేలా ఒప్పించి అమరావతిని నిర్మించారు. పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగ కల్పనకు కృషి చేశారు. ఒక్కసారిగా రాష్ట్రం ఉన్నతంగా నిలబడాలి అంటే అది కుదరదు. అప్పులన్నింటినీ ఒడిలో నింపుకుని తెలంగాణ నుంచి విడిపోయింది ఏపీ. ఒకవైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు రాష్ట్ర పునర్నిమాణం. అన్నీ సమస్యలే. చక్కబెట్టేందుకు ఐదేళ్లు చాలవు. కానీ జనానికి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పట్టలేదు. అవతల జగన్ చేస్తున్న జిమ్మిక్కులకు పడిపోయారు.
జగన్, చంద్రబాబుల పొజిషన్స్ చేంజ్ అయ్యాయంటే..
ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు. బాబాయిని హత్య చేశారంటే జాలి పడ్డారు. కోడికత్తితో పొడిచారంటే బాధపడ్డారు. మొత్తానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తరువాత కానీ అసలు విషయాలు తెలియలేదు. ముఖ్యంగా 2023లో బాబాయి కుట్ర విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఆ తరువాత చంద్రబాబును జైలుకు పంపండం జగన్ చేసుకున్న స్వయంకృతం. చంద్రబాబుకు వరంగా మారింది. అప్పటి నుంచి మొదలు టీడీపీకి అంతకు ముందున్న హైప్ మరింత పెరిగింది. ఇక వైసీపీ పడిపోతున్న గ్రాఫ్‌ను లేపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయినా సరే ప్రయోజనం ఉండట్లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గట్టు దాటుతున్నారు. వాళ్లను కాపాడుకుందామని చేసిన ప్రయత్నాలూ విఫలం. టీడీపీ గ్రాఫ్ నానాటికీ పెరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు జగన్, చంద్రబాబుల పొజిషన్స్ చేంజ్ అయ్యాయంటే దానికి కారణం అక్షరాలా 2023.