కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామ తెరకెక్కించిన డెవిల్ నేడు 2023 ఇయర్ ఎండ్ కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. డెవిల్ షూటింగ్ చివరి దశలో ఈ సినిమా విషయంలో చాలారకాల కాంట్రవర్సీలు నడిచాయి. వాటిన్నిటిని సక్సెస్ ఫుల్ గా దాటుకుని ఈరోజు విడుదలైన డెవిల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కళ్యాణ్ రామ్ నటన పరంగా బావున్నా.. టెక్నీకల్ గా సినిమా ఉన్నతంగా ఉన్నా.. దేశభక్తి మరీ ఎక్కువైన ఫీలింగ్ కలగడంతో పబ్లిక్ డెవిల్ కి జస్ట్ యావరేజ్ టాక్ ఇచ్చారు.
హీరోయిన్ సంయుక్త మీనన్ కేరెక్టర్ నిడివి తక్కువే అయినా.. ఆమెది బలమైన కేరెక్టర్ కావడంతో బాగా హైలెట్ అయ్యింది. అయితే థియేటర్స్ లో నేడు డిసెంబర్ 29 న విడుదలైన ఈచిత్రం డిజిటల్ పార్ట్నర్ ఎవరంటే.. అమెజాన్ ప్రైమ్ డెవిల్ డిజిటల్ హక్కులని ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నట్లుగా.. ధ్రువీకరిస్తూ మేకర్స్ డెవిల్ టైటిల్ కార్డులోనే అమెజాన్ ప్రైమ్ ని డిజిటల్ పార్ట్నర్ అంటూ ప్రకటించారు. ఇక డెవిల్ ఓటిటి పార్ట్నర్ రివీల్ కాగా.. శాటిలైట్ పార్ట్నర్ మాత్రం ఈటీవి అని తెలుస్తోంది.
మరి డెవిల్ చిత్రం నాలుగు వారాల తర్వాతే అంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.