సలార్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రభాస్ ని చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ డిజాస్టర్స్ తో బాగా డిస్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ హిట్ తో సరిపెట్టుకుని అవన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మూడు ప్లాప్ లు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడగానే వారిలో ఆందోళన మొదలైంది. అప్పటినుంచి మారుతిపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. అందుకే మారుతి-ప్రభాస్ ఇద్దరూ ఆ చిత్రంపై ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా కామ్ గా షూటింగ్ చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు సలార్ బ్లాక్ బస్టర్ తర్వాత మారుతి సైలెంట్ గా తన సినిమా నుంచి అప్ డేట్ వదిలాడు. ఇప్పుడు వరకు మీరు డైనోసార్ ప్రభాస్ ను చూసారు, ఇక డార్లింగ్ ప్రభాస్ ని చూసేందుకు సిద్ధం అవ్వండి.. అంటూ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఈ సంక్రాంతి కానుకగా రివీల్ చేస్తున్నట్టుగా క్రేజీ అప్ డేట్ ని రివీల్ చేశారు. #PrabhasPongalFest అంటూ ఇచ్చిన ఈ అప్ డేట్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారా.. అంటూ నెటిజెన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని అడుగుతున్నారు.