ఎట్టకేలకు గుంటూరు కారం షూటింగ్ కి ముగింపు పలికిన మహేష్ తన ఫ్యామిలీ కోసం చెయ్యాల్సిన పనులు మొదలు పెట్టేసారు. ప్రతి ఏడాది క్రిస్టమస్ నుంచి న్యూ ఇయర్ వరకు పిల్లల హాలిడేస్ ని వేరే దేశాల్లో ఎంజాయ్ చేసే మహేష్ బాబు ఈసారి క్రిస్టమస్ హాలిడేస్ ని పక్కనబెట్టి గుంటూరు కారం పూర్తి చెయ్యడం కోసం కష్టపడ్డారు. ఆ షూటింగ్ నిన్న గురువారంతో పూర్తికావడంతో మహేష్ ఈరోజు ఉదయమే తన ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కేసారు.
ఈసారి మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం దుబాయ్ ని ఎంచుకున్నారు. కేవలం న్యూ ఇయర్ వేడుకల కోసమే కాదు అక్కడో యాడ్ షూట్ కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ సితార కలిసి, నమ్రత, గౌతమ్ కలిసి ఎయిర్ పోర్ట్ లో నడుస్తూ దుబాయ్ ఫ్లైట్ ఎక్కడానికి వెళుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది చూసిన మహేష్ అభిమానులు మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మా హీరో వెకేషన్స్ కి వెళ్ళాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.