మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ పూర్తి చెయ్యాలనే తపనతో క్రిష్ట్మస్ హాలిడేస్ కి వెళ్లాల్సిన వెకేషన్ ని, ఇంకా సెలబ్రిటీస్ ఇళ్లలో జరిగే పార్టీలని కూడా పక్కనపెట్టేశారు. ఆఖరికి నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన #Venky75 సెలెబ్రేషన్స్ కి గుంటూరు కారం షూటింగ్ వలనే వెళ్లలేకపోయారు. ఈరోజుతో అన్నపూర్ణ స్టూడియోస్ లో గుంటూరు కారం షూటింగ్ ఫినిష్ చేసి మహేష్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకి ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు
అయితే మహేష్ బాబు అంతగా షూటింగ్స్ తో కష్టపడిపోతూ బిజీగా ఉంటే నమ్రత మాత్రం పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గా మెగాస్టార్ క్రిష్ట్మస్ పార్టీకి నమ్రత ఒక్కర్తె వెళ్ళింది. చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలతో కలిసి ఆ పార్టీని ఎంజాయ్ చేసింది. తాజాగా నమ్రత ఉపాసన-చరణ్, శ్రీయ భూపాల్ తో కలిసి ఓ బర్త్ డే పార్టీకి హాజరైంది. ఈ పార్టీలో నమ్రత ,చరణ్-ఉపాసన, శ్రీయ భూపాల్ అందరూ కలిసి దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోస్ చూసిన వారంతా మహేష్ షూటింగ్స్ తో బిజీ-నమ్రత పార్టీలతో బిజీ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరి మహేష్ పార్టీకి వెళ్లలేకపోతే అయన తరపున నమ్రత వెళ్ళాలి కదా.. వెళ్ళాక అందరితో మింగిల్ అవుతూ సరదాగా ఎంజాయ్ చెయ్యాలి కదా. అదే ఇక్కడ జరిగింది. ఇక మహేష్ అండ్ నమ్రతలు పిల్లలతో సహా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం రేపో మాపో విదేశాలకు ఎగిరిపోతారు.