Advertisementt

హనుమాన్ కి సరైన మైత్రి కుదిరింది

Thu 28th Dec 2023 07:37 PM
mythri movie makers  హనుమాన్ కి సరైన మైత్రి కుదిరింది
Mythri Acquire HanuMan Rights హనుమాన్ కి సరైన మైత్రి కుదిరింది
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ కచ్చిఫ్ లు వేసుకుని కాలు దువ్వుతున్నా అందులో కాస్త కంగారు పడిన సినిమా హనుమాన్. ఒకవైపు సినిమాపై ఎంత మంచి బజ్ ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం కాస్త టెన్షన్ తప్పలేదు మేకర్స్ కి. ఈ సమయంలో అండగా నిలిచింది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్. ఇటీవలే సలార్ ని నైజాం లో రిలీజ్ చేసి ఇతర ప్రాంతాల వసూళ్లతో సంబంధం లేకుండా, మిక్స్డ్ రెస్పాన్స్ ప్రభావం పడకుండా.. అవలీలగా 50 కోట్ల షేర్ సాధించేసిన సలార్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ కి మంచి ఊపుని తెచ్చింది, ఉత్సాహాన్నిచ్చింది.

ఇప్పుడు అదే ఊపులో హనుమాన్ సినిమాని నైజాం లో విడుదల చెయ్యబోతున్నారు మైత్రి మూవీస్వారు. ఆల్మోస్ట్ 7 కోట్ల ఫాన్సీ రేటుకి నైజాం హక్కులు తీసుకున్న మైత్రి మూవీస్.. రిలీజ్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు గుంటూరు కారం రిలీజ్ చెయ్యబోతున్న దిల్ రాజు, మరో వైపు హనుమాన్ రిలీజ్ చెయ్యబోతున్న మైత్రి మూవీ మేకర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది దిల్ రాజు కి మైత్రి వారికి జరిగే మినీ యుద్ధమే అంటూ నెటిజెన్స్ కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు. మరి జనవరి 12 న నైజాం లో సందడి గట్టిగానే కనబడేలా ఉంది. 

Mythri Acquire HanuMan Rights:

Mythri Movie Makers Bagged Hanu Man Nizam Rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ