కోలీవుడ్ హీరో విశాల్ కి వయసుమీరిపోతున్నా పెళ్లి పై మాత్రం ఓ డెసిషన్ కి రాలేకపోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమాయణం తర్వాత విశాల్ అనీషా రెడ్డి తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని పెళ్ళికి రెడీ ఆవుతాడు అనుకుంటే.. ఈలోపులో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్టిస్ట్ అభినయ తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగినా.. దానిని విశాల్, అభినయ ఇద్దరూ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు.
అయితే ఇప్పుడు మరోసారి విశాల్ పెళ్లి మళ్ళీ వైరల్ గా మారింది. విశాల్ న్యూయార్క్ సిటీలో తన ప్రేయసితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎవ్వరికీ కనిపించకుండా సీక్రెట్ ని మైంటైన్ చేద్దామనుకుంటే.. అది కాస్తా సోషల్ మీడియాలో బట్టబయలైంది. దానితో విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడంటూ మీడియాలో హైలెట్ అయ్యింది. ఆ విషయమై విశాల్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.
తాను న్యూయార్క్ సిటీకి వెళ్ళింది నిజమే అని, న్యూ ఇయర్ వేడుకల కోసమే తాను న్యూయార్క్ సిటీకి వెళ్ళాను అని చెప్పిన విశాల్.. తానేమి ప్రేమలో పడలేదు, ప్రేయసితో తిరగడం లేదు. తన కజిన్స్ ఫ్రాంక్ ప్లాన్ చేసారు అంటూ విశాల్ అసలు విషయాన్ని తేల్చేసాడు. దానితో విశాల్ ప్రేమ, పెళ్లిపై అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది.