మహేష్ బాబు ని నిన్న బుధవారం రాత్రి #Venky75 ఈవెంట్ లో చూద్దామని అభిమానులు చాలా ఆతృతగా కనిపించారు. వెంకీ తో సినిమా చేసిన మహేష్ కూడా #Venky75 సెలెబ్రేషన్స్ కి గెస్ట్ గా పిలిచారు. మహేష్ కూడా అన్నయ్య కోసం వెళదామనే అనుకున్నాడు. మెగాస్టార్ చిరు, నాగార్జున, మహేష్ ఇలా స్టార్స్ తో ఈవెంట్ ప్లాన్ చెయ్యగా మహేష్ బాబు, నాగార్జున మాత్రం ఈ ఈవెంట్ కి రాలేకపోయారు. ఆ విషయంలో మహేష్ కూడా చాలా ఫీలయ్యాడట.
అసలు మహేష్ బాబు #Venky75 సెలెబ్రేషన్స్ కి వెళ్లకపోవడానికి కారణం ఆయన పని చేస్తున్న గుంటూ కారం షూటింగ్ అంట. నిన్నటితో అన్నపూర్ణ స్టూడియోస్ లో గుంటూరు కారం షూటింగ్ ఫినిష్ కావాల్సి ఉంది. సంక్రాంతి బరిలో నిలిపేందుకు మహేష్ చాలా కష్టపడుతూ ఆఖరికి క్రిష్ట్మస్ హాలిడేస్ కి వెకేషన్స్ కి కూడా వెళ్లకుండా త్యాగం చేసి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. న్యూ ఇయర్ కల్లా ఫ్రీ అవుదామనుకుని మహేష్ గుంటురు కారం పూర్తి చేస్తున్నాడు. ఇవాళో రేపో గుమ్మడికాయ కొట్టేందుకు దర్శకుడు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు.
ఇలాంటి టైంలో రెండు మూడు గంటలు ఒక ఈవెంట్ కోసం వేస్ట్ చెయ్యాలని మహేష్ అనుకోలేదు. గుంటూరు కారం నిన్న రాత్రి 11 వరకు షూట్ జరిగింది, ఈ రోజు ఉదయం మళ్లీ 9 కే మొదలయింది. పూర్తిగా అలిసిపోయిన మహేష్ అందుకే #Venky75 ఈవెంట్ కి హాజరవలేదని తెలుస్తుంది. కానీ మహేష్ ఫాన్స్ మాత్రం ఈ విషయంలో చాలా డిస్పాయింట్ అయ్యారు.