మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ డిసాస్టర్ తర్వాత కొత్త సినిమా మొదలుపెట్టకుండా భారీ గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో మోకాలి ఆపరేషన్ చేయించుకుని కూల్ గా రెస్ట్ తీసుకుని ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వసిష్ఠ తో విశ్వంభర మూవీని స్టార్ట్ చేసారు. 200 కోట్ల బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే హై బడ్జెట్ చిత్రంగా ఉండబోతుంది. సోషియో ఫాంటసీ డ్రామాతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభించారు. అయితే చిరంజీవి మాత్రం ఇప్పటివరకు ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టలేదు.
సంక్రాంతి తరువాత నుంచి మెగాస్టార్ చిరు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ కి విలన్ గా సలార్ నటుడు శౌరవ్ నటిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సెకండ్ హాఫ్ లో కటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ లో మెయిన్ ఫైటర్ గా కనిపించిన శౌరవ్.. చిరంజీవి మూవీలో ఓ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఇంకా రానా దగ్గుబాటి ఈ చిత్రంలో ముఖ్యం పాత్ర చేయబోతున్నారని, త్రిష ఫిమేల్ లీడ్ చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.