ఈమధ్యన మెగాస్టార్ చిరు, నాగార్జున, వెంకీలు కలిసి కనిపించినప్పుడల్లా.. బాలయ్య అభిమానుల్లో ఏదో తెలియని ఆందోళన. తమ హీరో ఒక్కరే సీనియర్ హీరోల పక్కన కనిపించడం లేదు అని నందమూరి అభిమానులు తెగ ఫీలైపోయేవారు. ఈమధ్యన దివాళి పార్టీ అని నాగార్జున, వెంకటేష్ లతో మెగాస్టార్ చిరు ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అదిగో అప్పటినుంచే బాలయ్య అభిమానుల్లో కుళ్ళు స్టార్ట్ అయ్యింది.
అయితే తాజాగా వెంకటేష్ తన 75 వ చిత్రం సెలెబ్రేషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాద్ JRC లో చేసిన సెలెబ్రేషన్న్ కి చిరు, నాగ్, మహేష్ లు గెస్ట్ లు రాబోతున్నారనగానే మరోసారి బాలయ్య అభిమానులు ఫీలయ్యారు. చిరు-నాగ్-వెంకీ ల పక్కన బాలయ్య కనిపించరు.. ఎందుకంటే ఈఫంక్షన్ ముందు సోషల్ మీడియాలో వెంకీ 75 సెలబ్రేషన్స్ కి చిరు, నాగ్ గెస్ట్ లు అని ప్రచారం జరిగింది. అది చూసాక నందమూరి అభిమానులు ఫీలయ్యారు. అయితే రాత్రి జరిగిన ఈవెంట్ కి నాగార్జున, మహేష్ బాబు ఇద్దరూ హాజరవలేదు.
మెగాస్టార్ ఒక్కరే Venky75 సెలెబ్రేషన్స్ కి వచ్చారు. డిస్సపాయింట్ మెంట్.. మహేష్.. నాగ్ రాలేదు.. అని సోషల్ మీడియా లో న్యూస్ చూడగానే నందమూరి ఫాన్స్ కళ్ళల్లో మెరుపు. ప్రస్తుతం వారు హ్యాపీగా ఫీలవుతున్నారు.