గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రముఖ నటుడు/DMDK అదినేత విజయకాంత్ (71) ఈరోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనా ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈమధ్యనే ఆసుపత్రిలో చికిత్స తీసుకుని క్రిటికల్ కండిషన్ లోకి వెళ్లిన విజయ్ కాంత్ మళ్ళీ తేరుకుని డిశ్ ఛార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చారు. కానీ మరోసారి తీవ్ర అస్వస్థతతో చెన్నై మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ఈరోజు గురువారం కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. విజయకాంత్ మృతికి ప్రముఖుల సంతాపం తెలియజేస్తున్నారు.
విజయకాంత్ మృతికి సంతాపంగా నేడు తమిళనాడు లోని థియేటర్స్ లో షో లు రద్దు, 1952 ఆగస్టు 25 న మదురై లో జన్మించిన విజయ్ కాంత్, 2005 సెప్టెంబర్ 14 న DMDK పార్టీనీ స్థాపించిన విజయ్ కాంత్, 2005 తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నిక,2011 లో ప్రతి పక్ష నేతగా ఉన్న విజయ్ కాంత్, విజయ్ కాంత్ చివరి సినిమా మధుర విరన్ (2018), విజయ్ కాంత్ కు ఇద్దరు కుమారులు, యాక్షన్ హీరోగా విజయ్ కాంత్ కి ప్రత్యేక గుర్తింపు, తెలుగు లో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాలు.