Advertisementt

ఇలా టీజ్ చేస్తే.. తట్టుకోలేం దేవరా..

Sun 31st Dec 2023 04:55 PM
anirudh devara,  ఇలా టీజ్ చేస్తే.. తట్టుకోలేం దేవరా..
Anirudh Teases On NTR Devara ఇలా టీజ్ చేస్తే.. తట్టుకోలేం దేవరా..
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సౌండ్ దద్దరిల్లిపోతోంది. సోషల్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా అని లేకుండా అన్ని మాధ్యమాల్లో దేవర తాండవమాడేస్తున్నాడు. ఈ సందడి చూస్తుంటే.. త్వరలోనే టీజర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. చిత్రయూనిట్ కూడా సోషల్ మీడియాలో అలా టీజ్ చేస్తోంది మరి. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ అయితే.. ఫ్యాన్స్‌ని పిచ్చపిచ్చగా కెలికేశాడు. తాజాగా అనిరుధ్ చేసిన దేవర ట్వీట్ చూస్తే.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవడం కాయం.

అసలే చాలా కాలంగా ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ట్రెండ్ బద్దలు కొడుతున్నారు. అలాంటి ఫ్యాన్స్‌తో టీజింగ్‌కి దిగాడు అనిరుధ్. టీజర్ అంటూ ఊరించినంత పని చేశాడు. టీజర్ ఎప్పుడనేది చెప్పలేదు కానీ.. టీజర్ అంటూ క్లాప్స్ కొట్టి.. తారక్ మరియు కొరటాల శివ.. ఎగ్జయిట్ అవుతున్నాను అంటూ మ్యూజిక్‌కి సంబంధించిన ఎమోజీలను షేర్ చేశాడు.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆల్ హెయిల్ ది టైగర్ అంటూ అనిరుధ్ ఇచ్చిన హ్యాష్ ట్యాగ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అనిరుధ్ ఇచ్చిన హింట్ ప్రకారం టీజర్‌కు మ్యూజిక్ రెడీ చేస్తున్నట్లుగా అయితే అర్థమవుతోంది. అందుకే ఇలా టీజ్ చేశాడనేలా కామెంట్స్ కురుస్తున్నాయి. ఒక వైపు కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రమోషన్స్‌లోనూ, మరో వైపు అనిరుధ్ ఇలా టీజ్ చేస్తుంటే.. తట్టుకోలేం దేవరా.. తొందరగా టీజర్ వదలండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌తో యూనిట్‌లో హుషారును పెంచుతున్నారు.

Anirudh Teases On NTR Devara:

Anirudh Post on Young Tiger NTR Starring Devara Goes Viral

Tags:   ANIRUDH DEVARA,
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ