అక్కడ రామ ఏంటి? ఇక్కడ హనుమా ఏంటి? ఏం అర్థం కాలేదు కదా. రామాయణంలో సీతని రావణాసురుడు ఎత్తుకుని వెళ్లిపోయేటప్పుడు.. అతనితో పక్షిరాజు (ఈగల్) పోరాడటమనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా చూస్తే రామాయణంలో రామునికి ఈగల్ సాయం చేసినట్లే. మరి హనుమ సంగతేంటి? హనుమంతుడు లంకకి వెళ్లడానికి సాయం చేసింది పక్షిరాజు జటాయివు కాదు కదా.. ఆయన తమ్ముడు సంపాతి కదా! సంపాతి కూడా ఈగల్ జాతే కదా. సో.. ఆ లెక్కన చూస్తే హనుమకి అక్కడ కూడా ఈగల్ సాయం చేసినట్లే భావించవచ్చు. కానీ అక్కడ లాభం పొందేది రాముడు కాబట్టి.. ఈగల్ అక్కడ రాముడికి సాయం చేసిందనే చెప్పుకోవాలి. ఇక్కడ విషయానికి వస్తే..
ఇక్కడ హనుమకి కూడా ఈగల్ సాయం చేస్తుంది.. అదెలా అనుకుంటున్నారా? మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న సినిమా పేరు ఈగల్. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న సినిమా హను-మాన్. మ్యాటర్ అర్థమైంది కదా. అదే.. ఈ హను-మాన్‌కి ఈగల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని హనుమాన్ మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు.
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాల హను-మాన్ చిత్రంలో వానరంకు ఓ ప్రత్యేక పాత్ర ఉంది. హనుమంతుడిని అంతా వానర రూపంలోనే కొలుస్తారనే విషయం తెలియంది కాదు. హను-మాన్‌లో వానరం పాత్రకు ప్రశాంత్ వర్మ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారట. ఇందులో వానరం పేరు కోటి. ఈ కోటి పాత్రకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తూ.. ఈ హనుమాన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. అలా.. ఇక్కడ హనుమకు ఈగల్ సపోర్ట్ లభించింది. విశేషం ఏమిటంటే.. రవితేజ నటిస్తోన్న ఈగల్, ఆయన వాయిస్ ఓవర్ అందిస్తోన్న హను-మాన్ చిత్రాలు రెండూ సంక్రాంతి బరిలో ఉండటం.