మామూలుగానే మంట పెట్టి చలి కాచుకోవడం వైసీపీకి అలవాటు.. అసలే చలికాలం కావడంతో మరింత మంట పెట్టి చలికాచుకునే పనిలో ఉన్నారు. బరిలోకి దిగేవాడు గెలవడానికి ట్రై చేస్తే సక్సెస్ సాధిస్తాడు. కానీ వైసీపీ ప్రయత్నమంతా ఎదుటోడిని ఓడించడంపై పెడుతోంది. ఇక్కడే గురి తప్పుతోంది. ఇంక గెలుపెలా సాధ్యం? ఫోకస్ మొత్తం ఎదుటోడి నాశనంపైనే పెడితే నీ ఎదుగుదల ఎలా? ఇవేమీ పట్టని వైసీపీ దారి తప్పుతోంది. వైసీపీ నేతలంతా పనిగట్టుకుని మీడియా ముందుకు రావడం.. టీడీపీ, జనసేన పొత్తుపై విమర్శలు గుప్పించడం. ఎంతసేపూ వారి పొత్తును విచ్ఛిన్నం చేస్తే మన గెలవచ్చనే ఆరాటమే తప్ప మన గెలుపు కోసం ఏం చేద్దామనేది లేదు.
దెబ్బతిన్న విషయాన్ని ఎలా మరిచిపోతారు?
ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రశ్నలు వైసీపీ నేతలకు అస్సలు పట్టవు. విషయాన్ని దొడ్డిదారిన తీసుకెళ్లి వారిపై మాటల దాడి చేయాలి.. ఇదే మెయిన్ టార్గెట్. తాజాగా వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియా ముందుకు వచ్చారు. గతంలో జనసేన, టీడీపీ పొత్తు కారణంగా ఓటమి పాలయ్యారు. మరి దెబ్బతిన్న విషయాన్ని ఎలా మరిచిపోతారు? అందుకే పొత్తును ఎలాగైనా తుంచేయాలన్న టార్గెట్‌తోనే మీడియా ముందుకు వచ్చారు. మేకపోతు గాంభీర్యాలు పోతూనే టీడీపీలో జనసేన విలీనమై ఏపీలో కనుమరుగై పోతుందని జోస్యం చెప్పారు. ఇక అక్కడి నుంచి మొదలు.. చంద్రబాబుకి ఊడిగం చేసేందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు.
పొత్తు విచ్ఛిన్నమైతే కానీ గెలవలేని తుప్పాస్ క్యాండిడేట్‌వా?
మాటలేవైనా సరే.. మెయిన్ మోటివ్ మాత్రం జనసైనికులను రెచ్చగొట్టాలి. పొత్తును మంటగలపాలి. తద్వారా లబ్ది పొందాలి. మరి నీకు సొంతంగా బలం లేదా? ఎవరి పొత్తో విచ్ఛిన్నమైతే కానీ గెలవలేని ఒక తుప్పాస్ క్యాండిడేట్‌వా? అని జనం అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడున్న పీకేకు మరో పీకే తోడయ్యాడు. అంతే.. అంతకు మించి ఒరిగేదేమీ లేదంటూ సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు. ఒరిగేదేం లేనప్పుడు ఆ విషయాన్ని లైట్ తీసుకోవచ్చు కదా. విమర్శలు గుప్పించి వీరే ఆ విషయాన్ని హైలైట్ చేయడమెందుకు? ఇక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తన స్థాయిని మరిచి వ్యాఖ్యలు.. చంద్రబాబు ఒక డెకాయిట్ అట. రానున్న ఎన్నికలలో చంద్రబాబు ఆ పీకే, ఈ పీకేలను వెంటేసుకొని వచ్చిన ఏపీలో పీకేదేమీ లేదంటూ వైసీపీ భాషలో మాటలు. వీరంతా ఎందుకింత దిగజారి వ్యాఖ్యలు చేసి జనంలో చులకనవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.