Advertisementt

సంక్రాంతి బరి నుండి ఆ మూవీ ఔట్

Wed 27th Dec 2023 04:09 PM
pongal lal salaam  సంక్రాంతి బరి నుండి ఆ మూవీ ఔట్
One Movie Out in Pongal Race Films సంక్రాంతి బరి నుండి ఆ మూవీ ఔట్
Advertisement
Ads by CJ

రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఫైట్ యమా రంజుగా ఉండబోతోంది. మేమంటే మేమంటూ దాదాపు ఓ ఐదారు సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు పోటీపడుతున్నాయి. గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్.. ఈ ఐదు సినిమాలు టాలీవుడ్ నుండి సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమవుతుండగా.. సందట్లో సడేమియా అనేలా.. కోలీవుడ్ నుండి కూడా ఓ నాలుగైదు సినిమాలు ఈ సంక్రాంతి బరిలో ఉండటం.. ఇప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. 

కోలీవుడ్‌ నుండి ఈ పొంగల్‌కి ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తియేయన్ అయలాన్, విజయ్ సేతుపతి మెర్రి క్రిస్మస్ చిత్రాలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ చిత్రం కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ విడుదలవుతాయి. అంటే, దాదాపు 10 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నట్లే. దీంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయనేది అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న. తాజా సమాచారం ప్రకారం ఈ లిస్ట్‌లో నుండి సూపర్ స్టార్ తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తున్న లాల్‌ సలామ్ చిత్రం సంక్రాంతి రేస్‌ నుంచి వెనక్కితగ్గినట్టు సమాచారం. ఇందులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌... మొహిద్దీన్‌ భాయ్‌గా ఓ అతిథి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి పక్కా అన్నట్లుగా మొన్నటి వరకు మేకర్స్ ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడీ సినిమా వాయిదా పడినట్లుగా కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు కానీ.. ఈ సినిమాని పొంగల్‌కి కాకుండా జనవరి 26న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో, సంక్రాంతి బరిలో ఉన్న వారికి కాస్త రిలీఫ్ దొరికనట్లయిందని.. అంతా మాట్లాడుకుంటున్నారు.

One Movie Out in Pongal Race Films:

Rajinikanth Starring Lal Salaam Postponed From Pongal

Tags:   PONGAL LAL SALAAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ