ఈమధ్యన మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో దివాళి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తన తోటి సమకాలీకులైన సీనియర్ హీరోస్ నాగార్జున, వెంకటేష్ లని పార్టీకి ఆహ్వానించి బాలయ్యని మరిచిపోయారు. మరి చిరు పిలిచినా బాలయ్య రాలేదో? లేదంటే బాలయ్యని చిరు పిలవలేదో కానీ.. నాగ్-చిరు-వెంకీ పక్కన బాలయ్య కనిపించకపోయేసరికి నందమూరి అభిమానులు బాగా ఫీలయ్యారు.
మళ్ళీ ఇప్పుడు మరోసారి ఇలాంటిదే రిపీట్ కాబోతుందా.. అంటే అవుననే మాట వినిపిస్తోంది. వెంకటేష్ తన 75 వ చిత్రం #Saindhav ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, మహేష్ బాబు ఇలా స్టార్స్ చాలామంది రాబోతున్నారట. వెంకీ తో పని చేసిన 75 మంది దర్శక, నిర్మాతలు ఈ స్టేజ్ పై కనిపించబోతున్నారని తెలుస్తుండగా.. చిరు-నాగ్-వెంకీ ఒకే వేదికపై అనే వార్త చూడగానే మరోసారి బాలయ్యని పక్కనపెట్టేశారా అనే వార్త గట్టిగానే సర్క్యులేట్ అవుతుంది.
డిసెంబర్ 27 న హైదరాబాద్ లోని JRC లో జరగబోయే వేడుకలో వెంకీ తెరంగేట్రం చేసిన కలియుగ పాండవులు దగ్గరనుంచి ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న #Saindhav చిత్ర దర్శకులు, నిర్మాతలతో పాటుగా చిరు, నాగ్ లు స్పెషల్ గా కనిపించబోతున్నారట. మరి ఈ న్యూస్ చూసిన వారంతా వెంకీ సమకాలీకుడు బాలయ్యని మర్చిపోయారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.